Sunday, August 04, 2019

యోగి కైనా భోగి కైనా...శివయ్యా నీవే ధర్మం నాదే కర్మ "నా"దనే కర్మ !!! .

శివయ్యా నీదే ధర్మం నాదే కర్మ! "నా"దనే  కర్మ..!! 


శివయ్యా నీ కిది తగునాఇదేం ధర్మంఇదేం న్యాయం
నీవే దిక్కని, నీ దిక్కే నాధృక్కుఅంటున్నా
నువ్వే నిజమని అదే నా నైజమని నమ్మినవాణ్ణి 
నీకిది తగునా కారుణ్యేశ్వరా రారా నను కాపాడ రావా !! 


నీవే నా గమ్యమంటూ పయనిస్తుంటే చీకటి కోర్కెల గుహల్లోకి  నెట్టావయ్యాకాపాడయ్యా అంటె కష్టాల కన్నీళ్ళలో ముంచావయ్యా 

ఇదేమి ధర్మం నీ దేమి ధర్మం!కరుణించ వేమి  పశుపతినాధ!


జ్ఞానం"నీ"ది  అజ్ఞానం "నా"ది "నీ" బంధం కావాలంటే, "నా" అనుబంధాలను త్యజించమంటావు, పోని నేకోరివస్తానన్న వానికి ఆత్మత్యాగం పాపమంటావు, మరి సంసార కొలిమి లో ఏల మండిస్తావు? నేనేమి కోరాను నువ్వేమిఇచ్చావు సర్వేశ్వరా ఇదేమి ధర్మం నీ దేమి ధర్మం!



అలమటిస్తే గాని ఆకలి రుచి తెలియదనిపరితపిస్తేగాని ప్రేమ మధురం తెలియదని, జపతప రోదనావేశంలో "నాలోఉన్న "నీ" ఉనికి తెలియనివ్వవు, నను మన్నించవయ్యా  మహిమాన్విత హిమగిరివాసా!



నినునమ్మిన వాడనునను నమ్మవేమయ్య  శివయ్యా,

నటన నీదిమాయ నీదిలీల నీది, మరి నాకేల   పరీక్ష లయ్యా"నీ"లో కలుస్తానన్న కోరికే నన్ను పవిత్రుడ్ని చేస్తుందయ్యా  శివయ్యా, నేనది మదిలో నమ్మానయ్య దయాద్ర హృదయ 
కల్మషరహిత కరుణా సాగరా నమోస్తుతే నమోస్తుతే నమో నమః


శివయ్యా తలిచే నిన్నుకొలిచె నిన్ను, పిలిచే నిన్ను భక్త జన పాలకుని దర్శన కోసం, ఇలనైనా, కైలాసమునైనా 

నువ్వే నిజమని నమ్మివానికి  అహంకార రహిత పావనుణ్ణి చేసిజీవన్ముక్తున్ని చేసే నీదే ధర్మం అదే సధర్మం, పునర్జన్మ రాహిత్యమే నీ కరుణా  ప్రసాదంనమోస్తుతే నమోస్తుతే  శివయ్యా నమో నమః!!


No comments:

Post a Comment