Saturday, August 10, 2019

అతడు కాదు, ఆమె కాదు ...యోగి కైనా ...భోగి కైనా ...!!



అతడు కాదు, ఆమె కాదు ...యోగి కైనా ...భోగి కైనా .. !!


అతడు కాదు, ఆమె కాదు అన్నీ "నీ" రూప, ప్రతిరూప  ఆసక్తి  "శక్తి" రూపలే  

"నా" లోని ఆలోచనల పరంపరలో దాగిన  ఏ రూపమైన "నీ" రూపమే, అపురూపమే !! 


అశాంతితో శాంతి కోసం, అలజడితో, ఆందోళనతో సహనమంటూ సహజీవనం చేస్తూ 

పేరు ప్రతిష్టలంటు పరుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ, బడలికతో బ్రతుకంతా భారంగా 

బ్రతుకు లోని జీవితానందం అర్ధం కాక పెడార్థల తో, ప్రగల్భాల ప్రేలాపనలతో బ్రతికి 

బ్రతుకు చరమాకంలో నిర్వీర్య నిర్జీవ సమరం తో  సాధనాసమాధి పొందే దెప్పుడు ?

సాధనా యోగిగా జీవించి, యోగంలోసంయోగం చెంది, జీవన సమాధిని  అనుభవిస్తే 

విందుల భోగి, భోగ విలాసాలతో క్షణికానంద విజయాలలో ఎప్పుడైనా  పొందగలిగేనా? !



"నా"ది  అంటూ , "నా " తోనే ఉన్నంతవరకు, "నాదే" అనుకున్నంతవరకు 

ఎప్పుడూ, ఎల్లప్పుడూ బందీ గా , బానిసగా  జీవితాంతం బ్రతికేస్తావ్, కాని 

నాదేది?, అంతా "నీ"దే , అన్నీ నీవే, అంతా నీవే  అనుకున్నానంతనే, ప్రకృతంతా 

భావనా  పరవళ్లు తో పయనిస్త,  ఆనందాన్ని ఆశ్వాదిస్తూ జీవించినంతవరకు   

జీవితాంతం పరమానందాన్ని అనుభవిస్తూ జీవించడమే మోక్షగామం !!


అందుకే, అన్నందుకే  భగవంతని తెలుసు కోవాలని, చూడాలనుకుని 

సంసార పరిత్యాగం పేరుతో బాధ్యతలను బరువనుకొని, బంధనాశనమే బాగనుకొని,  

భగవతదర్శన  మార్గమంటే సన్యాసమే అంటూ బడలిక తో పరుగెడకు, 

సంఘర్షణా భావంతో, మానసిక ఘర్షణ తో సాధన మాని, సంసార ప్రేమ సాగరం లో 

అమ్మను, నాన్నను, మౌనంగా పునఃశ్చరణ తో దర్శించు, అమ్మానాన్నలను శరణని!



"నీ"నిశ్శబ్ద సాధనే మార్గమని  నమ్మి నిశ్చలంగా, నిర్మలంగా , నిశ్చయ సాధనతో 

భగవతదర్శన భాగ్య ఋషులు, మహాత్ములు తెలుసుకున్నది, అన్నది , ఉన్నది

అదే "శక్తి " ఆదిశక్తి, నిరంతరం ఉన్నదే "శక్తి " స్వరూపం, అదే శుభం, శుభప్రథమ్ !!!


No comments:

Post a Comment