అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా ఎన్నెన్ని అందాలో
అరుణ కిరణ వెలుగులోని తొలి స్పర్శతో వికసించే కలువల అందాలు
ప్రకృతి వడిలోని ఒరవడిలో పచ్చదన పైరులు, సెలయేర్లు, కొండలు కోనలు,
అంతెందుకు నీలో ఉన్న నీ చుట్టూ ఉన్న మానవత్వ మహత్యం చూడరా!
అంతని, ఇంతని, అనంత కోరికల వ్యామోహ అగాధం లో బందీయై
బ్రతుకంతా భారమంటూ, భాదలనే స్మరిస్తే భగవంతుని కళ కళ్ళకు కనిపిస్తే
మది స్పందించని రాయివి కాకు ఆనందాల హరివిల్లులు రంగులలో జీవించు
తనువుని, తనవారిని హింసిస్తూ అజ్ఞాన అంధకారంలో నిదురించే స్వార్థజీవికి
సాధనేది, ప్రతికూల ఆలోచనలతో ప్రయత్నిస్తుంటే ఫలితమేమి ?
జీవునిలోని సప్త చక్రాలు, సృష్టిలోని సమస్త వర్ణాల జీవాలు దేవుని ప్రతిరూపలైతే
నిరంతరం అఙ్ఞాన అంధకారంలో జీవించే స్వార్ధానికి సాధన ఏది, సాధించేదేది?
మనుషుల మమతల కోవెల లో వెలసిన మహిమాన్విత పరంజ్యోతిని దర్శిస్తే
సృష్టి అందం, సమస్త జీవైఖ్య బంధం, జీవితానందం జీవితాంతం కలుగవా!
వేదన, సంవాదన పాఠాలలో దాగి ఉన్న వేద రహస్యంమిదే, చైతన్య వికాసమే !!
అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా!!
ఆనందం, బాధ, సంతోష దుఃఖాలన్నీ మధురానుభవాలే కనుగుంటే
అందులో,ఇందులో, విందులో, పొందులో, ఆలా, ఇలా, ఏలోల, ఇలలో, కలలో
అన్నింటా దర్శించు ఆనంద మధుర క్షణాలను పరమాత్ముని సన్నిది తో
తరతరాలకో నిదర్శనమై, ఉజ్జ్వలవై ప్రజ్వలంగా , సాక్ష్యంగా, సాక్షిగా జీవిస్తూ
పరమాత్మానంద మదితో జీవిస్తే అదే జీవిత పరమార్థం, ఇదే సృష్టి రహస్యం
అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా!!
అరుణ కిరణ వెలుగులోని తొలి స్పర్శతో వికసించే కలువల అందాలు
ప్రకృతి వడిలోని ఒరవడిలో పచ్చదన పైరులు, సెలయేర్లు, కొండలు కోనలు,
అంతెందుకు నీలో ఉన్న నీ చుట్టూ ఉన్న మానవత్వ మహత్యం చూడరా!
అంతని, ఇంతని, అనంత కోరికల వ్యామోహ అగాధం లో బందీయై
బ్రతుకంతా భారమంటూ, భాదలనే స్మరిస్తే భగవంతుని కళ కళ్ళకు కనిపిస్తే
మది స్పందించని రాయివి కాకు ఆనందాల హరివిల్లులు రంగులలో జీవించు
అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా!!
సాధనేది, ప్రతికూల ఆలోచనలతో ప్రయత్నిస్తుంటే ఫలితమేమి ?
జీవునిలోని సప్త చక్రాలు, సృష్టిలోని సమస్త వర్ణాల జీవాలు దేవుని ప్రతిరూపలైతే
మనుషుల మమతల కోవెల లో వెలసిన మహిమాన్విత పరంజ్యోతిని దర్శిస్తే
సృష్టి అందం, సమస్త జీవైఖ్య బంధం, జీవితానందం జీవితాంతం కలుగవా!
వేదన, సంవాదన పాఠాలలో దాగి ఉన్న వేద రహస్యంమిదే, చైతన్య వికాసమే !!
అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా!!
ఆనందం, బాధ, సంతోష దుఃఖాలన్నీ మధురానుభవాలే కనుగుంటే
అందులో,ఇందులో, విందులో, పొందులో, ఆలా, ఇలా, ఏలోల, ఇలలో, కలలో
అన్నింటా దర్శించు ఆనంద మధుర క్షణాలను పరమాత్ముని సన్నిది తో
తరతరాలకో నిదర్శనమై, ఉజ్జ్వలవై ప్రజ్వలంగా , సాక్ష్యంగా, సాక్షిగా జీవిస్తూ
పరమాత్మానంద మదితో జీవిస్తే అదే జీవిత పరమార్థం, ఇదే సృష్టి రహస్యం
అందమైన లోకం మనలోకం, చుట్టూ చూడరా, చుట్టి చూడరా!!
No comments:
Post a Comment