యోగి అయినా భోగి అయిన -పరమాత్మ
యోగి అయినా భోగి అయిన పరమాత్మ కు అందరూ సమానమే!
మరి భేదం చూసేది, కోరేది మాయలో ఉన్న మనసు మాత్రమే !!
యోగి అయిన భోగి అయిన మరోటి అయిన అన్ని రూపాలే !
అజ్ఞానం ఓ సంసార సాగరం, నీ జ్ఞానం సంస్కారం!
మనిషిగా కోరేది, కళ్ళు చూసేది రూప దర్శనం మాత్రమే !!
పరమాత్మా మరి నీ జ్ఞాన దర్శనం ఎప్పుడో !!
అదిమరచి, ఆదమరచి మాయాజ్ఞాన మడుగులో మురుగుతూ
"మూఢ అజ్ఞానాన్ని" విజ్ఞానం అనుకుంటూ చొప్పదంటు వాదనలతో జీవించి
ఆరూపం గొప్పది, ఈ రూపం గొప్పదంటూ " ఇదే పరమాత్మ దర్శనం" అనే వారికి
ఎన్ని జన్మలైనా, ఎప్పటికీ అజ్ఞానాంధకారం లో అర్థం కాని "అరూపి" పరమాత్మ!
జ్ఞాన దర్శనం లో వెలిగే "వెలుగే" పరమాత్మ!
పరమాత్మా నమస్కారం !!
No comments:
Post a Comment