యోగి అయినా భోగి అయిన -భగవత్ భావనే పరమార్ధం !!
యోగి కైనా భోగి కైనా -భగవత్ సేవే పరమ పవిత్రం
"అర్ధమైన అర్ధం కోసం " వెదికి సేవచేసేవాడు భోగి !,
పరమార్ధాన్నికోరి ఎరుకతో చేసే సేవా కర్మజీవనమే యోగి!!
బాధలో పరమాత్ముని లీలను తలచి తరించేవాడు యోగి!,
కష్టాల్లో కరుణించమని కోరి, కోరి కష్టాలను మూటకట్టేవాడు భోగి!
భగవంతుని యోగ మాయ లో యోగా యాగం తో సంయోగం చెందేవాడు యోగి!,
భోలాతనం తో సంయోని మాయలో సంగమం చెందేవాడు భోగి !
యోగి కైనా భోగి కైనా -భగవత్ భావనా దర్శనం ప్రధమం, పరమ పవిత్రం, మోక్ష ప్రధాయం !
యోగి అయినా భోగి అయిన పరమాత్మ కు అందరూ కావలసిన వాళ్ళే!!!
No comments:
Post a Comment