Tuesday, April 10, 2018

యోగి అయిన భోగి అయిన  "నేను నువ్వే "


నేను అన్నది నిజం నీవు అన్నది నిజం 

నేను నిన్నుగా చూస్తున్నది నిజం అందుకే  "ద్వైతమ్ "

నేను నువ్వు ఉన్నది  ఆ పూర్ణమ్ లో అన్నదే "అద్వైతమ్". 

అన్నింటికి ఉన్నదే పూర్ణమ్ అన్నదే పరమాత్మ , ఆ పరమాత్మే అద్వైతం! 

నీవు, నేను అన్నది, నాది నీది అన్నది "నేను" చూస్తున్నంత వరకే 

"నేను" ఉంటే ద్వైతం లేకుంటే అద్వైతం 

"నేను" లేని నేను లేను కాబట్టి నాది ద్వైతమ్, 

అందుకే నీవు నాకు అందవు ఓ పరమాత్మా!




No comments:

Post a Comment