Tuesday, April 13, 2010

విరోధి కాకు ఓ విద్యార్థి!!!!

ఈ విశాల విశ్వం లో విరోధి కాకు ఓ విద్యార్థి
విరోధి కాకు నీ బంగారు జీవితానికి,
జీవితకాలనికి, విరోధి కాకు ఓ విద్యార్థి!!!!
కన్నీళ్ళ తో గతాన్ని కోరుతూ వర్తమానాన్ని వృధా కానీకు,
ఊహల లోకం లో విహరిస్తూ భవిషత్తు ను వృధా కానీకు,
విలువయినది జీవితం తప్పుగా తిరుగకు,
తిప్పకు వెలలేని కాలాన్ని, అదే నీ జీవితం
తిరిగి రానివి ఈ రెండూ, వృధా కానీకు ఓ విద్యార్థి!!!!
కాగితాలకు పరిమితం కానీకు నీ చదువు,
అశాశ్వత ఆవేశపు ఆనందం కారాదు నీ గమ్యం,
చెదురు ముదురు ఆలోచనలు చేర్చు నిన్ను చివరకు,
విరోధి కాకు ఓ విద్యార్థి వర్తమానాన్ని వృధా చేస్తూ,
అవరోధాల అంచుల పై పయనిస్తూ వృధా కానీకు ఓ విద్యార్థి
నీ, మా, ఆశల శౌధాన్ని, కూలనీకు ఎన్నటికి
విరోధి కాకు ఓ విద్యార్థి జీవితకాలానికి!!

ఆశయ సాధన కోసం పట్టువదలకు ఈవేళ
అమూల్య మైనది నీ పాత్ర మనదేశాభివృద్ధికి
అందుకే వృధా కానీకు నీ బంగారు భవితను
అదే కావాలి అందరికి ఆదర్శం ఓ విద్యార్థి!!!!

No comments:

Post a Comment