Tuesday, June 07, 2011




మీరు ఎలా భరించారో ఈ కష్టాలను
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు
కానీ సరిదిద్దు కోలేని తప్పు చేసారు.

నాలో ఎన్నో జ్ఞాపకాలను ఉంచారు
ఓ జీవితకాలం గుర్తుంచుకునే అనుభందాన్ని ఇచ్చారు.
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను

నా జీవితాన్ని మార్చుకునే జ్ఞాన సంపద ఇచ్చారు
నా విజ్ఞానాన్ని, నిపుణతను పెంచుకొనే అవకాశాన్ని ఇచ్చారు
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను.

ఎంతో రాయాలని, మరెంతో చెప్పాలని ఉంది
కానీ గుండె అంతా భారంగా ఉంది
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను.

మీ చిరునవ్వులు జ్ఞాపకం ఉన్నాయ్
మీ ఆత్మీయత గుర్తుంది, ఆదరణ గుర్తుంది
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను.

మా సిస్టర్ ఎలా ట్రేడ్ చేస్తుందని అడిగారు
మీరు మంచి పోసిషన్ కు వెళతారని అన్నారు
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను

మరిచి పోలేని మంచితం మీది,
అందరు "నాకు రమేష్ స్పెషల్ గ చూస్తారని" అంటారు
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను

మీ అబిమానం వేల కట్టలేనిది
మీ అనుభందం ఇప్పుడు ఓ మధుర జ్ఞాపకం
ఐన తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంటాను

గుండె అంతా బరువుగా ఉంది,
కళ్ళు చెమ్మ గిల్లుతున్నై
ఐన తప్పు చేశారనే అంటాను
ఎందుకంటె ఆ తప్పు ఎవరూ చేయకూడదు కాబట్టి

మూగ బోఇన హృదయం తో మరోసారి ప్రామిస్ చేస్తున్న
మీకుచేప్పిందే మరోసారి తలచుకున్న
మీరు ఎక్కడ ఉన్న గర్విస్తారని ........

బమ్మిడి నాగేశ్వర రావు

No comments:

Post a Comment