తల్లి భారతమాత ..... వందనాలు
తల్లి ఓ తల్లి, నా తల్లీ మా తల్లీ
భారతమాత నీకు ఇవే నావందనాలు
ధరిత్రిగా అమ్మలు గన్న అమ్మలకు ఆది జన్మవు నీవు
ప్రియ దర్శినివి ఈలోక శాంతి స్వరూపివి నీవు
అందరిని ఆదుకునే తల్లిగా ఈ లోకానికి శాంతి దూతవు
ఒనాతల్లి భారతమాత నీకు మా వందనాలు!!
అందరి అమ్మవు నీవు, దేశ పేదలందరికీ
కడునిండా కూడు, వంటినిండా గుడ్డలిచ్చి, ఓ గూడునిచ్చి
శ్రమ జీవులకు చేయూతనిచ్చి, అందరిని ఆదుకునే
పాలించే నాయకులనిచ్చి కాపాడు తల్లీ మమ్మలును,
ఒనాతల్లి భారతమాత నీకు మా వందనాలు!!
తల్లిగా దీవించు ప్రపంచమంతా గర్వించే
ప్రగతి పథం లో అందరం ప్రయనించాలని,
అమ్మాగా మాకు నేర్పించు, శ్రమ తో, పరిశ్రమ తో,
విజ్ఞాన వెలుగులతో, జగద్వితంగా జ్వలించే కీర్తిని పొందాలని,
ఒనాతల్లి భారతమాత నీకు ఇవే మా వందనాలు!!
No comments:
Post a Comment