Sunday, January 12, 2020

స్వయంభూ యోగి భోగ విలాసం ...!!!

స్వయంభూ యోగి భోగ విలాసం 

నీ దయతో నిత్యమైమేమున్న లోకం లో మనసున్న మహానుభావులేందరున్న
ప్రతి మనసు ప్రతిమలో ప్రతిసారి మళ్లి మళ్ళీ మనసారా కోరేది నిన్నే మహా దేవా!

జగములెల్ల జటాజూటములై, అండ పిండ భ్రామండములెల్ల రుద్రాక్షలుగా,
విశ్వమంతా  విభూదిగా నున్న విశ్వేశ్వరా  సరిలేరు నీకుసాటి    అమరేశ్వరా !

నిత్య వెన్నెల చంద్రయ్యాచల్లని గంగమ్మల తోడ శిఖరాతి శిఖరముల పై 
నీలిమేఘాలు చెంత నిండైన మనసుతో ఉన్న నిను దర్శిస్తి  శ్రీశైల ఈశ్వరా !

నీది నాదంటూ కోరే కోర్కెలతోనున్న మమ్ము ఉద్ధరింప సమస్త విశ్వం నీవై 
ఉద్బవించిన సర్వేశ్వరా  నమో నమః జ్యోతిర్లింగేశ్వరా!

మరపురాని మా తల్లి జగన్మాత భ్రమరాంబిక మందహాసినియై తలచి
నిను సేవించ నేనేతించి మిము జూడ  శ్రీశైల మల్లేశ్వరా!

కను గొంటి  కన్నులారా, తరించా, తనివితీరా మ్రొక్కితిని నిండైన మనసుతో,

తరలి వచ్చితిని నిను చూడ తనివితీర నీ భోగ విలాసం  శ్రీశైల మల్లికార్జునా!

==============================
మరోసారి తలచుకొంటి, తరింప  చేసే  ఓ నీల కంఠ స్వరూపా .... 
==============================

యోగి భోగ విలాసం 

మేమున్న లోకం లో మనసున్న మహానుభావులేందరున్న, 
మనసు మనసు మళ్లి మళ్ళీ మనసారా కోరేది నిన్నే ఓ మహా దేవా!

జగములెల్ల జటాజూటములై, అండ పిండ భ్రామండములెల్ల రుద్రాక్షలుగా,
విశ్వమంతా  విభూదిగా నున్న విశ్వేశ్వరా  సరిలేరు నీకుసాటి  ఓ  అమరేశ్వరా !

వెన్నెల చంద్రయ్యా, చల్లని గంగమ్మల తోడ శిఖరాతి శిఖరముల పై 
నీలిమేఘాలు చెంత నిండైన మనసుతో ఉన్న నిను దర్శిస్తి ఓ శ్రీశైల మల్లికార్జునా!

నీది నాదంటూ కోరే కోర్కెలతోనున్న మమ్ము ఉద్ధరింప సమస్త విశ్వం నీవై 
ఉద్బవించిన సర్వేశ్వరా  నమో నమః ఓ జ్యోతిర్లింగేశ్వరా!

మరపురాని మా తల్లి జగన్మాత భ్రమరాంబిక మందహాసినియై
నిను సేవించ నేనేతించి మిము జూడ  ఓ శ్రీశైల మల్లేశ్వరా!

కను గొంటి  కన్నులారా, మ్రొక్కితిని నిండైన మనసుతో,
తరలి వచ్చితిని నిను చూడ తనివితీర ఓ శ్రీశైల మల్లికార్జునా!

===========================

BAMMIDI NAGESWARA RAO & B. PRABHANJ VEER

DATE OF JOURNEY: 02-03-2018 FRIDAY, TOTAL HOURS ON VEHICLE 15 Hrs( Approx)


Total distance covered 630 km (Hyd to Srisailam via Kalwakurthy and returned via Dornala, Macherla route)


VEHICLE: TWO WHEELER: ZEUS 125, 2010

FROM KUKATPALLY, HYDERABAD TO SRISAILAM 

MORNING STARTED AT 7.40AM REACHED 1.10AM (3-03-2018)

==========================

శివయ్య నీకు వందనాలు ...!!!

No comments:

Post a Comment