2. యోగి భోగ విలాసం - యోగి ధర్మం
భగవంతుని తెలుసుకోవాలనుకోవడం, అందుకోసం చేసే ప్రతి ప్రయత్నం ఓ గొప్ప అనుభూతి గా చెప్పవచ్చు. ప్రతి క్షణం జీవన ప్రయాణం లో భగవంతుని చూడగలిగిన వారు పరమ పావన జీవనం లో జీవిస్తారు. కానీ, సామాన్యులుగా ఉన్న మనం కోర్కెల చట్రం లో చిక్కుకుని అందులోనే బ్రతుకుతూ , కొదవలేని కోర్కెలతో సమస్యలను సృష్టించి బ్రతుకు భారం అని వాపోతాము. కోర్కెల కోరల లో సమస్యలను సృష్టించుకుటూ సమస్యల పరిస్కారం కోసం బ్రతుకంతా సాగదీస్తాం. సాగె వస్తువు లో టెన్షన్ ఉంటుంది.
ఆందోళనలో సమస్యను జటిలం చేసే ఆలోచనల పరంపరలు వచ్చి మరింత ఆందోళనలకు గురిచేసి ఎదో ఒకటి ఏదో విధంగా ఎలాగోలా ప్రయత్నం చేసే విధంగా ప్రేరేపిస్తాయి. అందుకు వచ్చే ఫలం- నిస్పృహ, నిస్సహాయత.
సమస్యలు లేని బ్రతుకు మనిషి జీవితము లో ఉండదు. అలాఅని సమస్యలే బ్రతుకు కాకుండా , పరమాత్మే జీవితం గా జీవించి, జీవన పరమార్థం గా భావించి, ప్రయాణం సాగించటం యోగి ధర్మం.
No comments:
Post a Comment