Saturday, August 10, 2024

ఆది అయై భగవంతుడు, అద్వైతమే భగవంతుడు అందుకే భగవంతుడై నాడు .....

 ఆది అయై భగవంతుడు, అద్వైతమే భగవంతుడు అందుకే  భగవంతుడై నాడు ..... 

ఈ లోకం లో ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా, అంతం వరకు అర్ధం కానివ్వని 

జననం, జీవనం, గమనం, జీవన పోరాటం అంతా ద్వైతమే! 

ద్వైతం ఓ మాయై, అంతా కనిపిస్తూ, కవ్విస్తూ, ఊరిస్తూ, అహంభావ ఉవ్విళ్ళులో ఊరేగిస్తూ,

బంధాల అనబంధాల వేవిళ్లు తో అంతా తల మునకలైనట్లు చేస్తుంది ... అలాగే 

ద్వైతమే సత్యమంటూ, ఆలపిస్తూ, క్షణికానందాల అరుపుల ఆయాసం తో 

వలపుల ముసుగులో, మురుగు జీవితం మధుర జీవితమని తలచేటట్లు చేస్తుంది.

రక్త మాంస రోగాభిష్ట జీవన వేదనల బంధంలో బంధినైతినని రోదిస్తూ, 

మరుజన్మను ప్రాధిస్తూ జీవన చరమాంకంలో గుర్తెరిగే కంటే, 

అయ్యో మూణ్నాళ్ల ముచ్చటే ఈ జీవన మాయ అని గుర్తించి, 

పరమాత్మను మరిపించే ప్రకృతి ప్రలోభాల భ్రాంతిలో జీవించక  

పరమాత్మే పరమసత్య మనే భావనలో జీవిస్తూ, జగత్ సృష్టి, స్థితి, లయకాల శక్తే  

సదా చిదాత్ముడై  సర్వ వ్యాప్తమై జగత్తు లో సర్వాణుశక్తి అయై 

అంతర్యామి రూపం లో సర్వకాల సర్వావస్థ, సర్వరూప, స్వరూపమని 

సదా భావించి, నిత్యానందభరితులమై నిష్కామ సాధన తో 

సాధించాల్సిన అద్వైత భావమే భగవంతుడు.  

No comments:

Post a Comment