Tuesday, July 30, 2024

భగవంతుడు అర్ధం ఔతాడు... ఎలా ?

ప్రపంచం లో ఉన్న ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. 

మొదటది మనం అర్ధం చేసుకోలేం, రెండవది అర్ధం కాదు. 

చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా ఒకటి కాదు అలాగే 

ఈ రెండింటిని దాటి అలోచించి అర్ధం చేసుకుంటే 

భగవంతుడు అర్ధం ఔతాడు. 

నిజానికి సృష్టిలో మనం ఉన్నాం కాని సృష్టి మనతో లేదు 

కాబట్టి సృష్టి ని మనం అర్ధం చేసుకోవాలి. 

ఈ సృష్టి మనకు అర్ధం కాదు కాని సృష్టినే సృష్టించిన 

భగవంతుడు అర్ధం కాలేదని వాపోవడం లో అర్ధమే ముంది 

ఇదే కదా భగవంతుని గొప్పతనం !

భగవంతుని లెక్కలు మనం అర్ధం చేసుకుంటే 

లెక్కలకు దొరకానివాడని అర్ధం అవుతుంది. 

అప్పుడే లెక్క సరిపోతుంది. మరి లెక్కలెందుకో !

అంతర్యామిని అర్ధం చేసుకుంటే అంతా అర్ధం అవుతుంది.   

 


No comments:

Post a Comment