Tuesday, December 03, 2019

"అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా......

"అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా నీ అపురూపమే...........  యోగి కైయిన భోగి కైయిన...




నీ అరూపం జననం తో ఓ రూపం, జననం లో దాగి ఉన్న జీవ శక్తివి నువ్వు 

రూపం మరణం తో అరూపం గా మాయం, మరణం లో దాగి ఉన్న నిర్జీవం నువ్వు

జననం మరణం ల మధ్య ఉన్న జీవనానురాగ జీవితం నువ్వు ... 

శక్తివి నువ్వు, అశక్తివి నువ్వు, ఆశక్తివి నువ్వు, నిరాశక్తివి నువ్వు, అన్నీ నువ్వే 

అంతా నువ్వే అయినా  నువ్వెవరని, ఎక్కడని వెదికే ప్రయత్నం మాది  !!


మా శ్వాస కోసం గాలి రూపం లో ఉన్న వాయు స్వరూపానివి నువ్వు,

కంటి కోసం కాంతిరూపం లో ఉన్న జ్యోతిస్వరూపానివి నువ్వే,

చెవి కోసం ఉన్న శబ్దరూపం లో ఉన్న నాదస్వరూపానివి నువ్వు,

చర్మం కోసం స్పర్శ రూపం లో ఉన్న అనుభూతి రూపానివి నువ్వే,

నోటి కోసం రుచి రూపంలో, ఆకలి కోసం ఉన్న అన్నం పరబ్రహ్మం నువ్వు,

సర్వేంద్రియాల సుఖాల కోసం ఉన్న ఆనందస్వరూప అపురూపనివి నువ్వు!!. 


అన్ని ఇంద్రియాలు ఉన్నా, నీవిన్ని రూపాలలోఉన్న, నిను గుర్తెరగని జీవశవాన్ని నేను,

సృష్టి లోని అన్ని రూపాలలో ఏ రుపేంద్రియాలు లేక, నాలోనే ఉన్న, నాతోనే ఉన్న 

నీ నన్ను గా నడిపిస్తూ, నను నన్నుగా జీవింపజేస్తున్న పరిపూర్ణ పరమాత్మవు నువ్వు!!

అందుకే అందుకో వందనాలు నేనిస్తున్నా మా అందరి తరపునా ..... !!!




1 comment: