Sunday, August 25, 2019

ప్రయత్నం తోనే... యోగి అయిన భోగి అయినా ...

ప్రయత్నం తోనే...  యోగి అయిన భోగి అయినా ... 

నిరంతర సాధన ఓ యజ్ఞం యోగికి, భోగ వస్తు సమపార్జన ఓ సమరం భోగికి,

ఇద్దరికి కావలసింది ప్రయత్నం లో ఓపిక, పట్టుదల, సాదిస్తామన్న నమ్మకం ..!!

అలనాపాలన లో బిడ్డకు తల్లి త్యాగం, మధురం మైన ప్రేమ పెరుగుదలకు అవసరం

పంచ భూతాల తో నిండిన ప్రక్రుతి లో జీవించే  జీవికి పరమాత్మ అంతే అవసరం కదా !!


స్వచ్ఛత లో మురికి ఉండవచ్చు కాని మురికిలో స్వచ్ఛత ఉండనట్లు ,

వెలుగువస్తే  చీకటి తొలగుతుంది కానీ చీకటి లో వెలుగుండనట్లు , 

ఆకలిని ఆవేదన  నింపనట్లు , అనుమానం అజ్ఞానాన్ని తొలగించనట్లు 

ఆరాటం ఆశను పెంచుతుంది కాని, ప్రయత్నమే ఫలితాన్ని ఇస్తుంది కదా !!
  

భయానికి కారణం అజ్ఞానం కాదా , అజ్ఞానానికి కారణం ఆలోచన రాహిత్యమైతే 

అవిశ్వాసాన్ని కడిగేస్తే , అజ్ఞానాన్నితుడిచేస్తే, ఉదకం లో కమలం లా  

స్వచ్ఛత తో సత్యం ఉద్భవిస్తే, సత్యమే పరమాత్మనే సత్య దర్శనం తో 

వెలుగుల హరివిల్లు లో ఉజ్జ్వల మైన  సజీవ దర్శనమే పరమాత్మ కదా! 


భోగి అయిన, యోగియైన వస్తువు లను వెలుగులో చూడగలిగితే, స్పర్శతో స్పందిస్తే, 

సవిశ్వాస యోగి భృకుటి నేత్ర ధరుడయి, పరమాత్మ దర్శనమే పరమావధిగా 

విశ్వాస నిశ్వాసలా  గమనాతి అనుభూతి అనుబంధం లో దాగిఉన్న  దైవాన్ని 


అన్నివేళలా హర్షిస్తూ, విశ్వాసం ఉన్నవాళ్లు మాత్రమే విశ్వాత్మను దర్శించగలరు !!



No comments:

Post a Comment