Tuesday, April 14, 2015

మనసు చేసే మాయే జీవితం.....!!!!

మనసు చేసే మాయే జీవితం!
ఆనందం బాధ అంతా మనం కోరుకున్నదే
సంతోషం విచారం అంతా మనసు ఆడే ఓ గొప్ప ఆట !!

కలలైన కన్నీళ్ళు అయిన మనసు ఇచ్చే సందేశం!
కనుగొన్న వాడు సంతోష లోగిల్ల లో యోగి,
అర్ధం కాని వాడి బాధ అనంత అగాధ సంసారి !!

జీవితం అంతా అనుభవాల సంగ్రహణం!
అయిన ప్రతి అనుభవం ఓ జ్ఞాపకం కాబోదు కాని
సంతోష విచార సంబంధం లేకుండ ప్రతి జ్ఞాపకం అనుభవమే!!

కనుగొంటి రెందరో, వివరించిరి మరెందరో మహానుభావులు!
అయిన ఆగని విశ్వాస జీవన పోరాట సంగ్రామలెన్నో
ఈ జీవానంత మాయలో, అలుపెరగని విశ్వానంత విశ్వంలో !!

No comments:

Post a Comment